సెల్లు సొల్లు!!!

ఎదవ సెల్ ఫోన్ వచ్చాక,చేతి నొక్కుడుతో అరచేయి అంతా అరిగిపోనాది. వేలు రూపు దానిపైన రేఖలు మాయమైపోనాయి!

బతుకు రేఖలన్నీ బద్నాము అయినాయి!నొక్కినప్పుడు తెలియాలేదు దాని మాయలన్నీ!మాటలూ చెప్పేది, ఊసులాడు కోనిచ్చేది!

నాటికే జనాలు ఒకరినొకరు కల్వడమే కరువాయనాయే!

గుడ్డిలో మెల్ల!!

జనం జనం మధ్య ముచ్చట్లు ఉండేవి -కలవక పోయినా! సొల్లు కబుర్లు అన్నీ సెల్లులోనాయే!

ఎదురు పడినా మాట్లాడడం బందు-ఎదుట నుంచున్నా కాని ముచ్చట్లు ఫోన్ లోనాయే;అందరి లొల్లి అంతా సెల్లులోనే!

ఆనాటి దాకా "ఎఫ్.బి" ల మాయలో ఉన్నాము! మాయ దారి మోడల్స్ వచ్చాక- స్మార్ట్ ఫోన్ (అందమైన ఫోన్ అనొచ్చా?)

కదిలే,ఆడే,పాడే బొమ్మలు చూపింది! మంచిగుంది గదా అనుకుంటే- ఇంకా చూపిస్తాన్- నాతోనేవుండి నువ్వు నొక్కుతూఉంటే అంది!

నొక్కే వాడికి బాగుంది, నొక్కించున్నంతసేపూ వెలుగుల్లో జిలుగుల్లో ముంచేసింది! సదువులన్నీ సంకనాకి పోయినాయ్!

అప్పుటి దాకా సక్కగానే- ఆరుబయటే ఆటలన్నీ! ఆరుదాటినా కూడా ఆడేవాళ్లం! ఇంటికెళ్ళంగానే అయ్య చేతుల్లో దెబ్బలూ తినేవోళ్ళం!

తెల్లదొర స్వాతంత్రం ఇచ్చినాక రోజులన్నీ బాగున్నాయి-కొన్నేళ్ళు!!!

ఇంకో తెల్లతోలు వాడొచ్చి నుగ్గు నుగ్గు చేసిండు మన టైంని! (అన్నీ,ఇక సక్కగా …. సెల్లులోనే అనీ!!!) బద్నాం అయ్యాయి బస్తీలు, పల్లెలూ -ఎవడు చూసినా కానీ సెల్లులో సోల్లులే!

జాఢ్యం తగులుకున్నాది పోరగాళ్ళకి -యువతరాన్ని బాంచను చేస్కుంది!

దేశమంతానూ స్మార్ట్ ఫోనూలొనే! ఇంతలోనే కొత్త వైరస్ వచ్చింది;ఆ వైరస్ వింత వైరస్ ఆయే, "ఎఫ్. బీ" కి బాబులాగున్నాది! ఆదేదో "వాట్సాప్" అంట! అంటకాచీ పట్టింది,రెండు చేతులకు పని అప్పచెప్పింది!ఒక చేతులో పట్టుడు మరో చేతితో నొక్కుడు!

ఈ జాఢ్యానికి, పిల్లకాయా, పెద్దాకాయలన్నీ"బాంచను" లన్నాయి!

పిల్లా పాపా లేదు, వయసు తారతమ్యం లేదు, ఆడాలేదు, మగాలేదు-పెద్దా చిన్నా తేడా లేదు!వేళా పాళా లేదు, దుంపతెంచుతోంది,పరేషాను చేస్తోంది దునియా అంతా! లోకమంతా పడింది నొక్కుడులో-వేలు నొక్కనివాడు అనాగరికుడయ్యాడు! వేలురేఖలు పోయినవాడు మేధావి అయ్యాడు!

ఈ నొక్కుడు జాఢ్యం ఇప్పటికీ,ఎప్పటికి వదిలేలా లేదు! రెండునెలల పిల్లకి కూడా పాకిపోయి అంటు జాడ్యం అయిపోనాది; కరోనా కంటే మహమ్మారి అయినాది!

తల్లితండ్రులకాడ నుండి ఆస్థిలాగా, వారసత్వంగా అయిపోయినాది!

ఆట పాటలన్నీ అరచేతిలోనాయే!కాలు కదిపేది లేదు, బయటకెళ్లకుండానే ఆటలయిపోయే!

సూర్యుడు డ్యూటీకి రాముందే,చంద్రుడు డ్యూటీ దిగేవరకూ నొక్కుడే పని ఆయే! వాళ్లిద్దరూ వచ్చినట్టు ఉనికి స్పృహే లేకాపోయే!

పుట్టబోయే తరానికి, సూర్య చంద్రులు తెలవబోతా లేదు! పొద్దస్తమానం జనమంతా నొక్కుల్లో మునిగిపోయారు!

కరోనా వైరస్ మాయ మవుతుందేమోగానీ,ఈ నొక్కుడు జాడ్యం లోకానికి పోదు!

జనం అంటున్నారు కరోనా వైరస్ తో. "వాట్సాప్ వైరస్ అంటుకున్నా వాణ్ని, నువ్వేమి చేస్తావే పిచ్చి మోహమా" అని మేము చూసుకుంటాము "వాట్సాప్" ని, మేము కొడతాం "అంజాన్" నీకు! మా పెద్దాయన చూస్తాడు నీ "తడాఖాని"!

మా మోడీ గారి దయ వల్ల ఇంత తీరుబడిగా రాయగలిగా! మన చిన్నాయన, ఉపరాష్ట్రపతి- వెంకయ్య నాయుడు గారు అన్నట్టు!!! “ప్రతీ తెలుగు వాడికి భాషా, గోషా,యాసా ఉండాలి”!!! ఈ పోస్ట్ డాక్టరేట్ సమయంలో నా తెలుగు, మఱియు యాసా ఇంకా అభివృద్ది చేసుకుంటా!!

ఆ పెద్దాయన ధర్మమా అని ప్రస్తుతం "వాట్సాప్ యూనివర్సిటీ" లో పోస్ట్ డాక్టరేట్ చేస్తున్నా;లాక్ డౌన్ అయ్యే లోపు నా డాక్టరేట్ కూడా అయిపోతుంది!

“నమో” నమః
ఉంటా మరి, ఇప్పటికే నా సెల్లుతో మీకు సొల్లు ఎక్కువ చెప్పాను!

(పెద్దాయన చెప్పేవరకు మాత్రం ఇంట్లోంచి కదలకండి, ఈరోజున పెద్దాయన మన తల్లిదండ్రుల కంటే మన బాగోగులు బాగా చూస్తున్నాడు, మన తల్లితండ్రుల బాగోగులు కూడానూ)

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!